ఈనెల 8న అయ్యర్‌కు శస్త్ర చికిత్స  | Shreyas Iyer Four Months To Recovery Going For Surgery On April 8th | Sakshi
Sakshi News home page

ఈనెల 8న అయ్యర్‌కు శస్త్ర చికిత్స 

Published Sat, Apr 3 2021 7:53 AM | Last Updated on Sat, Apr 3 2021 7:55 AM

Shreyas Iyer Four Months To Recovery Going For Surgery On April 8th - Sakshi

ముంబై: ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన భారత క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు ఈ నెల 8న శస్త్ర చికిత్స జరగనుంది. అతడు కోలుకోవడానికి నాలుగు నెలల సమయం పట్టే అవకాశముంది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెయిర్‌స్టో కొట్టిన షాట్‌ను ఆపే క్రమంలో అయ్యర్‌ ఎడమ భుజానికి గాయమైంది. దాంతో అయ్యర్‌ ఇంగ్లండ్‌తో జరిగిన తదుపరి రెండు వన్డేల్లో ఆడలేదు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌ టి20 టోర్నమెంట్‌ మొత్తానికీ దూరమయ్యాడు.

ఐపీఎల్‌లో అయ్యర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఐపీఎల్‌కు శ్రేయాస్‌ దూరమవడంతో రిషబ్‌ పంత్‌ను అతని స్థానంలో కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ను మార్చి 10న ముంబై వేదికగా సీఎస్‌కేతో ఆడనుంది.

చదవండి: IPL 2021: కెప్టెన్‌గా ధోని‌.. రైనాకు దక్కని చోటు

ఐపీఎల్‌ 2021: ఆల్‌రౌండర్లే బలం.. బలహీనత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement