టీ20 వరల్డ్‌కప్-2024లో లీగ్ స్టేజిని టీమిండియా ఘనంగా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కెనడా-భారత్ మధ్య జరగాల్సిన గ్రూపు మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
దీంతో గ్రూపు-ఎ నుంచి టీమిండియా 7 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే కెనడాతో మ్యాచ్ కంటే ముందే భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయభేరి మ్రోగించింది.
ఇక సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ వరల్డ్‌కప్ సంబంధించిన మొత్తం నాకౌట్ మ్యాచ్‌లన్నీ కరేబియన్ దీవుల వేదికగానే జరగనున్నాయి. ఈ క్రమంలో విండీస్ దీవులకు వెళ్లేముందు టీ20 వరల్డ్‌కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్‌గా వెళ్లిన శుభ్‌మన్ గిల్, అవేశ్‌ఖాన్‌లను తిరిగి స్వదేశానికి పంపాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకుంది.
అయితే టోర్నీ పూర్తికాకముందే టీమిండియా మెనెజ్‌మెంట్ ఎందుకు వారిద్దరి వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకుందో ఆర్ధం కాక ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో ముఖ్యంగా శుబ్‌మన్ గిల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను గిల్ సోషల్ మీడియాలో ఆన్ ఫాలో కూడా చేశాడని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. గిల్ గురుంచి వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తమని విక్రమ్ రాథోడ్ కొట్టిపారేశాడు. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే గిల్, అవేష్‌ను స్వదేశానికి పంపినట్లు రాథోడ్ తెలిపాడు.
"ఇది మా ముందుస్తు ప్రణాళికే. అమెరికాలో గ్రూపు స్టేజి మ్యాచ్‌లు ఆడే సమయంలో నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు ఉండాలనుకొన్నాం. అమెరికా మైదానాలపై ఆడే సమయంలో ఆటగాళ్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకే నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను సిద్ధంగా ఉంచాం. ఆ తర్వాత కరేబియన్ లెగ్‌కు వెళ్లేముందు ఇద్దరు రిజర్వు ఆటగాళ్లను మాత్రమే ఉంచాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే గిల్, అవేష్‌ను రిలీజ్ చేశాము"అని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రాథోడ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment