
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్మృతి మంధాన సూపర్ ఫిఫ్టీతో ఆకట్టుకుంది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్మృతి సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. 41 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేసింది. కాగా స్మతి కెరీర్‌లో ఇది 21వ అర్థశతకం. అయితే ఫిఫ్టీ కొట్టిన మరుసటి బంతికే గ్లెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బ్రంట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా వుమెన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్-బిలో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హర్మస్ సేన ఒత్తిడికి తలొగ్గి 11 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. రిచా ఘోష్ 34 బంతుల్లో 47 పరుగులు నాటౌట్ ఆఖరి వరకు ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయింది. స్మృతి మంధాన 52 పరుగులతో ఆకట్టుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్‌కు దాదాపు అర్హత సాధించగా.. టీమిండియా వుమెన్స్‌కు అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మిగతా రెండు మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment