Ind Vs Sa Test Series: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్ ద్వారా శ్రేయాస్ అయ్యర్ టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కాగా డెబ్యూ టెస్టు సిరీస్‌లోనే ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన అయ్యర్ టీమిండియా సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా రహానే, పుజారా విఫలమైనవేళ తన ఆటతీరుతో అయ్యర్ సెలక్టర్లను ఆకట్టుకొని సౌతాఫ్రికా టూర్‌కు ఎంపికయ్యాడు.
ఇప్పటికే దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా డిసెంబర్ 26 నుంచి మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శ్రేయాస్ అయ్యర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ సగటు యావరేజ్‌గా 50 ఉంది. గత పదేళ్లుగా అయ్యర్ దీనికి కాపాడుకోవడమే కాదు.. దానిని 52కు పెంచుకున్నాడు. ఇది అంత సులభం కాదు.. దీనిక వెనుక కఠోర శ్రమ ఉంటుంది. ఇదే ఆటతీరును అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో చూపెట్టడం పెద్ద సవాల్‌గా మారుతుంది.
అయితే శ్రేయాస్ అయ్యర్ ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో అయ్యర్ ప్రదర్శనపై ఫుల్ హ్యాపీ. అయితే సౌతాఫ్రికా టూర్ అయ్యర్‌కు అసలు పరీక్ష కానుంది. బౌన్సీ పిచ్‌లపై ఎలా ఆడతాడనేది ఆసక్తిగా మారింది. ఒక రకంగా అయ్యర్‌కు సౌతాఫ్రికా టూర్ రియల్ టెస్ట్ లాంటిది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో పేస్, బౌన్స్‌ను సమర్థంగా ఎదుర్కొంటే మేటి క్రికెటర్ అవుతారనేది నా వాదన. దానిని అయ్యర్ నిజం చేసి చూపిస్తాడని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: Sourav Ganguly: మొన్న ద్రవిడ్.. నిన్న లక్ష్మణ్.. ఇక సచిన్ వంతు... బిగ్ హింట్ ఇచ్చిన గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment