NZ Vs SA 2nd Test: South Africa Beats New Zealand By 198 Runs, Deets Inside - Sakshi
Sakshi News home page

SA Vs Nz 2nd Test: ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా

Published Tue, Mar 1 2022 12:13 PM | Last Updated on Tue, Mar 1 2022 3:01 PM

South Africa beats New Zealand by 198 runs - Sakshi

తొలి టెస్టులో ఘోర ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకుంది. హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. 426 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 227 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో డివాన్‌ కాన్వే (92),టామ్‌  బ్లాండల్‌(44) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, కేశవ్‌ మహారాజ్‌,జాన్సెన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 364 పరుగులకు ఆలౌటైంది.

ప్రోటిస్‌ తొలి ఇన్నింగ్స్‌లో సరేల్ ఎర్వీ(108), ఎల్గర్‌(41),మరక్రమ్‌(42) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. అదే విధంగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 293 పరుగులు సాధించింది. ఇక 71 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా 354 పరుగులు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో  ప్రోటిస్‌ బ్యాటర్ వెర్రెయిన్నే సెంచరీతో చెలరేగాడు. కాగా ఇదే వేదికలో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్‌ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ అండ్‌ 276 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement