Photo Credit: Twitter
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్ 2026) టోర్నీలో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో వెస్టిండీస్ చాంపియన్స్ చిత్తుగా ఓడింది. 243 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ చాంపియన్స్ 18.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో క్రిస్ గేల్ (31 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
చివర్లో కార్లోస్ బ్రాత్‌వైట్ (29) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆరోన్ ఫాంగిసో, ఇమ్రాన్ తాహిర్‌లు చెరో 3 వికెట్లు తీయగా, రోబి ఫ్రైలింక్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా చాంపియన్స్.. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (39 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఓపెనర్ రిచర్డ్ లెవీ (39 బంతుల్లో 87; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ అర్థశతకాలో విధ్వంసం సృష్టించడంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.
చివర్లో సారెల్ ఎర్వీ (23) ధాటిగా ఆడాడు. వెస్టిండీస్ చాంపియన్స్ బౌలర్లలో డేవ్ మొహమ్మద్ రెండు వికెట్లు తీయగా, ఫిడెల్ ఎడ్‌వర్డ్స్, రెయాడ్ ఎమ్రిట్, డ్వేన్ బ్రావో తలా ఒక వికెట్ తీశారు.
𝗨𝗡𝗜𝗩𝗘𝗥𝗦𝗘 𝗕𝗢𝗦𝗦, 𝗨𝗡𝗜𝗩𝗘𝗥𝗦𝗘 𝗖𝗟𝗔𝗦𝗦 🔥 Chasing 242, Chris Gayle anchored the West Indies Champions’ innings with a blazing 60 off 31 balls in a fighting chase against South Africa Champions. 💥 Watch the #WCL 2026 LIVE on Star Sports! https://t.co/qbWoEDjl4c
— Star Sports (@StarSportsIndia) October 5, 2026
ఇదీ చదవండి: స్లో ఓవర్ రేట్ దెబ్బ.. భారత్, వెస్టిండీస్‌లకు జరిమానా


