Photo Credit: BCCI Twitter
వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ విజయంతో జోష్ మీదున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు ఇరుజట్లకు ఐసీసీ జరిమానా విధించింది. అయితే వెస్టిండీస్ కంటే భారత్‌కే ఎక్కువగా జరిమానా విధించడం ఆశ్చర్యపరిచింది.
స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు వెస్టిండీస్‌కు వారి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించగా.. అదే సమయంలో భారత్‌కు మాత్రం వారి మ్యాచ్ ఫీజులో నుంచి 20 శాతం జరిమానా విధించడం గమనార్హం. నిర్ణీత సమయం ముగిసేలోగా భారత్ నాలుగు ఓవర్లు వెనుకంజలో ఉండగా, వెస్టిండీస్ రెండు ఓవర్లు వెనుకంజలో ఉందని, అందుకే విండీస్ కంటే భారత్‌కు ఎక్కువ జరిమానా విధించినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ స్పష్టం చేశారు.
దీంతో ఆర్టికల్ 2.22 ప్రకారం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ నమోదు చేసినందుకు గానూ భారత్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, విండీస్ జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు, కేటాయించిన సమయంలోపూ బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో అదనంగా ఐదు శాతం జరిమానా విధిస్తున్నట్లు రిఫరీ వెల్లడించారు. అయితే ఇద్దరు కెప్టెన్లు తమ తప్పును అంగీకరించడంతో ఇరుజట్లకు జరిమానాతో సరిపెట్టినట్లు రిఫరీ ప్రకాశ్ భట్ తెలిపారు.
మ్యాచ్ విషయానికొస్తే మూడో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (129 నాటౌట్) అజేయ సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ (92), రుతురాజ్ (57) అర్థశతకాలతో రాణించారు. అనంతరం వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ షెయ్ హోప్ (162 నాటౌట్) అజేయ శతకంతో జట్టును గెలిపించగా, అమీర్ జాంగో (67), కీమో పాల్ (44) రాణించారు. ఇక ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20కి లక్నో వేదిక కానుంది.
ఇదీ చదవండి: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని సిక్సర్..


