అండర్-19 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా యువ పేసర్ క్వేనా మపాకా సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. శ్రీలంకతో ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన మ్యాచ్‌లో ఈ కుర్ర బౌలర్ మరో ఐదు వికెట్ల ప్రదర్శనతో (8.2-1-21-6) విజృంభించాడు. మపాకాకు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇది మూడో ఐదు వికెట్ల ప్రదర్శన. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ సింగిల్ ఎడిషన్‌లో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయలేదు.
Kwena Maphaka put up another impressive performance, registering figures of 6/21 to claim the @aramco POTM 🌟
— ICC (@ICC) February 2, 2024
Catch his Highlights 📽#U19WorldCup pic.twitter.com/h6GTvg9TLY
ప్రస్తుత ఎడిషన్‌లో మపాకా ఈ మ్యాచ్‌కు ముందు జింబాబ్వే (10-1-34-5), వెస్టిండీస్‌లపై (9.1-1-38-5) ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మపాకా 18 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 17 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మపాకా బుల్లెట్ వేగంతో నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లను నిశ్రేష్ఠులను చేస్తున్నాడు.
మపాకా సంధించే బంతులకు బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. మపాకా ప్రదర్శనల కారణంగా ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీస్ రేసులో ముందుంది. ఈ కుర్ర బౌలర్ ఇటీవలే టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు కూడా సవాలు విసిరాడు. బుమ్రా కంటే వేగంగా యార్కర్లు సంధిస్తానని ఛాలెంజ్ చేశాడు.
ఇదిలా ఉంటే, శ్రీలంకతో మ్యాచ్‌లో మపాకా ఆరేయడంతో దక్షిణాఫ్రికా 119 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (71), రిలే నార్టన్ (41 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో విశ్వ లహీరు, తరుపతి, వడుగే తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక మపాకా ధాటికి 113 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడింది. లంక ఇన్నింగ్స్‌లో షరుజన్ షణ్ముకనాథన్ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మపాకాతో పాటు రిలే నార్టన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment