ఫిఫా ప్రపంచకప్‌లో 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2010లో చివరిసారి ఫిఫా ఫైనల్ చేరిన స్పెయిన్ ఆనాడు టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది. మళ్లీ ఇన్నేళ్లకు స్పెయిన్‌కు ఫైనల్ ఆడే అవకాశం రావడం విశేషం. ఫ్రాన్స్‌తో సెమీస్‌కు ముందు స్పెయిన్ స్టార్ లామినే యమాల్ ఎంబాపెతో పాటు ఆ జట్టుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
'భయపడేది మేము కాదు.. వాళ్లే మాకు భయపడతారు' అని యమాల్ అన్నట్లు ఫ్రాన్స్ కీలక సెమీస్‌లో అనవసర ఒత్తిడికి లోనయ్యి స్పెయిన్ చేతిలో పరాజయం చవిచూసింది. లామినే యమాల్.. ఎంబాపెకు చెప్పి మరీ దెబ్బతీశాడు. ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో గోల్ చేయనప్పటికీ యమాల్ తన సహచర ఆటగాళ్లు గోల్ చేయడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు.
సోమవారం 19వ పుట్టినరోజు జరుపుకున్న లామినే యమాల్‌కు ఫ్రాన్స్‌పై విజయంతో స్పెయిన్‌ను ఫైనల్ చేర్చి తన సహచరులు అతడికి బర్త్‌డే కానుకగా అందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లామినే యమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఫిఫా వంటి ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో మెస్సీకి ఎదురుపడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటిది ఈసారి ఫైనల్లో మెస్సీ ఎదురుపడితే ఆ మజానే వేరు. దాని కోసమే ఎదురుచూస్తున్నా. అది జరుగుతుందని ఆశిస్తున్నా' అని కామెంట్ చేశాడు.
ఇది విన్న స్పెయిన్ అభిమానులు.. ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు అని కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒజర్‌బయాల్ (22వ నిమిషం), పెడ్రో పొర్రో (58వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఈసారి ఫిఫాలో ఫ్రాన్స్ ఒక్క గోల్ చేయకపోవడం ఇదే తొలిసారి. తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన ఫ్రాన్స్ సెమీస్‌లో స్పెయిన్‌పై మాత్రం గోల్ చేయడంలో విఫలమైంది.
🚨 Lamine Yamal: “Facing Leo Messi in a World Cup final would be fantastic. I hope so!”, told DAZN. pic.twitter.com/xWsAJ2zv9d
— Fabrizio Romano (@FabrizioRomano) July 14, 2026
LAMINE YAMAL SHOWS OFF HIS DIAMOND CHAIN 💎💸
On his birthday, the Spain star arrived at the press conference wearing this dazzling chain ahead of tomorrow’s World Cup semifinal 🔥😱#LamineYamal #Spain #WorldCup2026 #Football #PressConference pic.twitter.com/V12ZXgb87Q— MARCA in English 🇺🇸 (@MARCAinENGLISH) July 13, 2026


