ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా చహల్ నిలిచాడు. ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో చహల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో చహల్ 167వ వికెట్ సాధించాడు.
తద్వారా అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో చహల్ అగ్రస్థానంలో నిలిచాడు. మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు తీసిన చహల్ 170 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. అమిత్ మిశ్రా(167 వికెట్లు) రెండో స్థానంలో, పియూష్ చావ్లా(157 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్(157 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక సునీల్ నరైన్ 153 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు టి20ల్లో అన్ని మ్యాచ్‌లు(లీగ్‌లు, అంతర్జాతీయం) కలిపి చహల్‌కు ఇది 300వ వికెట్ కావడం విశేషం. ఇలా చహల్ ఒక్క వికెట్‌తో రెండు రికార్డులను కొల్లగొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎస్‌ఆర్‌హెచ్‌పై రాజస్తాన్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఒక దశలో వంద పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగినప్పటికి చివర్లో అబ్దుల్ సమద్(32 నాటౌట్), ఉమ్రాన్ మాలిక్(19 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో వంద పరుగులు దాటగలిగింది.
రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, అశ్విన్, హోల్డర్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు రాజస్తాన్ రాయల్స్ బట్లర్, శాంసన్, జైశ్వాల్‌లు అర్థశతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment