అభిషేక్ శర్మ (PC: Instagram)
SRH star Abhishek Sharma summoned by Surat police: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్, పంజాబీ క్రికెటర్ అభిషేక్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. సూరత్‌కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు.
గుజరాత్ తక్ అందించిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల తానియా సింగ్ ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్‌గా రాణిస్తున్నారు. డీజే, మెకప్ ఆర్టిస్ట్‌గానూ ఆమెకు అనుభవం ఉంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే తానియా.. అభిషేక్ శర్మతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన తానియా బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆమె ఆత్మహత్యకు పాల్పడే ముందు చివరిసారిగా అభిషేక్ శర్మకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తానియా కాంటాక్ట్ హిస్టరీ చెక్ చేసిన పోలీసులు అభిషేక్ శర్మను విచారణకు పిలిచినట్లు సమాచారం.
రంజీ ట్రోఫీ ముగించుకుని.. ఐపీఎల్ కోసం
పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్‌లో పాల్గొన్నాడు. పంజాబ్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి 199 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు కూడా తీశాడు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.
అయితే, పంజాబ్ గ్రూపు దశలోనే నిష్క్రమించడంతో.. ఐపీఎల్-2024కు సన్నద్ధమయ్యే పనిలో పడ్డాడు అభిషేక్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్ తనను రిటైన్ చేసుకున్న క్రమంలో తాజా ఎడిషన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. ఇలా చిక్కుల్లో పడ్డాడు.
ఓన్లీ ఫ్రెండ్
అయితే, అభిషేక్ విచారణలో భాగంగా పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు సమాచారం. తానియా తనకు ఫ్రెండ్ మాత్రమేనని.. అయితే, చాలా కాలంగా ఆమెతో టచ్‌లో లేని అభిషేక్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ఆరంభించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనూ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే నిర్వహించాలని బోర్డు నిర్ణయించుకుంది.
చదవండి: Ranji Trophy: శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్.. ముషీర్ ఖాన్ ఎంట్రీ
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com.
Comments
Please login to add a commentAdd a comment