పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పోరాడి ఓడిన గ్రీకు వీరుడు స్టెఫానోస్ సిట్సిపాస్.. మ్యాచ్‌కు ముందు జరిగిన విషాదాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన నాన్నమ్మ చనిపోయినట్లు.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందే తనకు విషయం తెలిసినట్లు చెప్పుకొచ్చాడు. తన నాన్నమ్మలాంటి వ్యక్తిని తాను ఇప్పటి వరకూ చూడలేదని ఆయన తెలిపాడు. నాన్నమ్మ తననెప్పుడూ ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నించేదని, ఆమె లాంటి వ్యక్తులు కలలు కనడం నేర్పిస్తారని పేర్కొన్నాడు.
జీవితంలో గెలుపు ఓటములు సహజమని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించామా లేదా అన్నదే ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. కాగా, ఆ బాధను దిగమింగుతూనే ఫైనల్ బరిలో దిగిన సిట్సిపాస్.. తొలి రెండు సెట్లు గెలిచి గెలుపు దిశగా పయనించేలా కనిపించాడు. కానీ ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ అనూహ్యంగా పుంజుకోవడంతో ఓటమిపాలయ్యాడు. 4 గంటల 11 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై విజయం సాధించాడు.
చదవండి: వీరోచితం... ‘జొకో’ విజయం
Comments
Please login to add a commentAdd a comment