Novak Djokovic: ఆ కుర్రాడి సలహాల వల్లే టైటిల్‌ నెగ్గాను.. అందుకే ఆ గిఫ్ట్‌ | French Open 2021: Djokovic Gifts Winning Racquet to Young Fan | Sakshi
Sakshi News home page

Novak Djokovic: ఆ కుర్రాడి సలహాల వల్లే టైటిల్‌ నెగ్గాను.. అందుకే ఆ గిఫ్ట్‌

Published Mon, Jun 14 2021 8:24 PM | Last Updated on Tue, Jun 15 2021 12:24 PM

French Open 2021: Djokovic Gifts Winning Racquet to Young Fan - Sakshi

పారిస్‌: ఆదివారం రాత్రి జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 ఫైనల్లో అద్భుత విజయం సాధించి, 19వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జోకవిచ్‌.. ఓ చిన్నారి అభిమానికి తన విన్నింగ్‌ రాకెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. గ్రీకు వీరుడు, సిట్సిపాస్‌తో జరిగిన హోరాహోరీ పోరులో తొలి రెండు సెట్లను కోల్పోయిన జకో.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో గెలిచి రెండోసారి కెరీర్‌ స్లామ్‌ సాధించాడు. ఈ సందర్భంగా తాను టైటిల్‌ నెగ్గడానికి సహకరించిన కుర్రాడికి ఆయన అపురూపమైన బహుమతిని అందజేశాడు. తన పోరాటంలో కీలకపాత్ర పోషించిన చిన్నారి అభిమానికి కృతజ్ఞతగా విన్నింగ్‌ రాకెట్‌ను బహుకరించాడు. 

ఇదిలా ఉంటే, తన అభిమాన ఆటగాడి నుంచి ఊహించని గిఫ్ట్‌ను అందుకున్న ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టలేని సంతోషంతో గంతులేస్తూ కేరింతలు పెట్టాడు. ఈ మొత్తం సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా, ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)తో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ తుది సమరంలో జకో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో చారిత్రక విజయాన్ని సాధించాడు. టైటిల్‌ విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్‌ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించింది.
చదవండి: ఫైనల్‌కు కొద్ది నిమిషాల ముందే ఆ విషయం తెలిసింది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement