రాజస్థాన్‌కు చెందిన అల్ట్రా-మారథాన్ రన్నర్, భారత అథ్లెట్ సుఫియా సూఫీ సాహసయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంది. భారత సాయుధ దళాలకు నివాళిగా కన్యకుమారి నుంచి కారకోరం వరకు 88 రోజుల పాటు 5వేల కిలోమీటర్ల దూరం రన్నింగ్ చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం సుఫియా సూఫీ వెయ్యి కిలోమీటర్ల మార్క్‌ను చేరుకున్న క్రమంలో ఆ విశేషాలను తన ‘ఎక్స్’ వేదికగా ఫొటో రూపంలో పంచుకుంది. షూస్‌తో వెయ్యి సంఖ్య ఆకారాన్ని తయారు చేసిన సుఫియా .. ‘వెయ్యి కిలోమీటర్లు పూర్తైంది’ అని కామెంట్ చేసింది. 5 వేల కిలోమీటర్ల టార్గెట్‌లో మొదటి మెట్టును విజయవంతంగా పూర్తి చేయడం తనకు సంతోషంగా ఉందని సుఫియా తెలిపింది.
కాగా సుఫియా సాహసయాత్రపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇది నిజంగా అద్భుతం. దేశ భద్రతకు గస్తీ కాస్తున్న సాయుధ దళాలకు మీరు ఇస్తున్న గౌరవం చాలా బాగుంది’.. ‘రన్నింగ్‌కు షూకు సరైన నిర్వచనం చెప్పారు.. సలాం సూఫీ’..‘కంగ్రాట్స్ సుఫియా.. మీరు ఇలాగే ముందుకు సాగండి’ అంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు.
ఎందుకీ మారథాన్ రన్?
దక్షిణ భారత్ ఏరియా ప్రధాన కార్యాలయం మద్దతుతో ఈ మహత్తర కార్యక్రమాన్ని సుఫియా సూఫీ ప్రారంభించింది. దేశ భద్రత కోసం ప్రాణాలొదిలిన భారత సాయుధ దళాలకు నివాళిగా మారథాన్ రన్ ప్రారంభించింది. కాగా సూఫీ తన ప్రయాణంలో అన్ని ప్రధాన యుద్ధ స్మారక చిహ్నాలను గౌరవించనున్నట్లు తెలిపింది. తన సాహసయాత్రను లడఖ్‌లోని కార్గిల్ దివస్ వద్ద ముగించనున్నట్లు ఆమె పేర్కొంది.
సుఫియా సూఫీ చేస్తున్న ఈ మారథాన్ ఫీట్ వరల్డ్ రికార్డు సాధించడంతో పాటు ఆమె అకుంఠిత స్ఫూర్తికి, దీక్షకు, పట్టుదలకు నిదర్శనంగా నిలవనుంది. తన ఆరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్న సుఫియా అంకితభావానికి, మానసిక స్థైర్యానికి ఈ పరుగు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. కాగా జాతీయ ఐక్యత, దేశభక్తి, పట్టుదలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రయాణానికి నాంది పలుకుతూ, కల్నల్ సూర్య ముఖర్జీ.. సుఫియా సూఫీ మారథాన్‌ను మే 12న అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.
1000 Km done.… #RunAcrossIndia #RunforDreams #TributetoBravehearts #worldrecordattempt pic.twitter.com/Ryr1NNuea0
— Sufiya Sufi Runner (@sufirunner) May 29, 2026
చదవండి: మెస్సీ ఆడడంపై క్లారిటీ.. అర్జెంటీనా జట్టు ప్రకటన


