
ఐపీఎల్-2022లో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు దినేష్ కార్తీక్ దుమ్మురేపుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఆర్‌సీబీ జట్టుకు కార్తీక్ బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. కాగా అద్భుతంగా రాణిస్తున్న కార్తీక్‌ను ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని మాజీలు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడతున్నారు.
ఈ కోవలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరాడు. జాతీయ జట్టలోకి పునరాగమనం చేసేందుకు కార్తీక్ చాలా కష్టపడుతున్నాడని గవాస్కర్ తెలిపాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా కార్తీక్ భారత తరపున ఆడాడు. "గత ఏడాది కార్తీక్‌తో చాలా సమయం గడిపాను. మేము సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో 10-12 రోజులు పాటు క్వారంటైన్‌లో గడిపాము.
అతడు తిరిగి మళ్లీ భారత జట్టులోకి రావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. గతేడాది జరగిన యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టుకు ఆడాలాని కార్తీక్ భావించాడు. అయితే అతడి కోరిక అప్పుడు నెరవేరలేదు. బహుశా ఈ ఏడాది అది నేరవేరవచ్చు. ఎందుకంటే కార్తీక్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కాబట్టి అతడు కచ్చితంగా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడని నేను నమ్ముతున్నాను" అని స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 274 పరుగులు సాధించాడు.
చదవండి: IPL 2022: 'అతడు యార్కర్ల కింగ్.. ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment