టీ20 ప్రపంచకప్-2022కు భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వికెట్ కీపర్లు రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరికి చోటు దక్కింది. అయితే తుది జట్టులో వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే చోటు దక్కే అవకాశం ఉంది.
ఇటీవల ముగిసిన ఆసియాకప్‌లోనూ కీలక మ్యాచ్‌ల్లో తుది జట్టులో వీరిద్దరిలో ఒకరికి మాత్రమే చోటు దక్కింది. అయితే రానున్న ప్రపంచకప్ లో తానే భారత కెప్టెన్ అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో వీరిద్దరికి చోటు ఇస్తానని టీమిండియా దిగ్గజంసునీల్ గవాస్కర్ తెలిపాడు.
ఈ మెగా టోర్నీలో భారత్ విజయం సాధించాలంటే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "నేను ప్రపంచకప్ భారత తుది జట్టులో పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరికి చోటు ఇస్తాను. ఐదో స్థానంలో రిషభ్ పంత్, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తాను.
ఇక ఏడో స్థానంలో ఫినిషర్‌గా కార్తీక్ బ్యాటింగ్‌కు పంపిస్తాను. అదే విధంగా హార్దిక్ పాటు మరో నలుగురు బౌలర్లకు తుది జట్టులో చోటు ఇస్తాను. అన్ని విభాగాల్లో రిస్క్ తీసుకోవాలి. అప్పుడే ఈ మెగా ఈవెంట్‌లో విజయం సాధిస్తారు. కాగా టీ20 ప్రకటించిన జట్టు సమతుల్యంగా ఉంది.
జట్టు అన్ని విధాలుగా బ్యాలెన్స్ ఉంది కాబట్టే ప్రపంచ కప్ గెలవగలదని నేను భావిస్తున్నాను. ఆసియాకప్‌లో ఓటమి అనేది మేల్కొలుపు. అదే జట్టు ప్రపంచకప్‌తో తిరిగివస్తుందని ఆశాభావంతో ఉన్నాను" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2022: 'నేను మూడేళ్ల క్రితమే చెప్పాను.. పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి వస్తుందని'
Comments
Please login to add a commentAdd a comment