Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే, కేకేఆర్ మ్యాచ్‌లో ఒక అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ధోనిని ఆటోగ్రాఫ్ అడగడం ఆసక్తి కలిగించింది. ఈ అద్బుతం సీఎస్‌కే, కేకేఆర్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగింది.
Photo: IPL Twitter
ధోని అభిమానానికి ముచ్చటపడిన సునీల్ గావస్కర్ స్వయంగా అతని వద్దకు ఆటోగ్రాఫ్ అడిగాడు. ఒక దిగ్గజ క్రికెటర్ ఆటోగ్రాఫ్ అడిగితే ధోని కాదంటాడా చెప్పండి. సునీల్ గావస్కర్ షర్ట్ ముందుబాగంలోనే ధోని తన ఆటోగ్రాఫ్ ఇవ్వడం.. ఆ తర్వాత ధోనిని సునీల్ గావస్కర్ మనస్పూర్తిగా హత్తుకోవడం అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Sunil Gavaskar taking autograph from MS Dhoni on his shirt.
— CricketMAN2 (@ImTanujSingh) May 14, 2023
What a picture. pic.twitter.com/d74Rsq6YcR
Photo: IPL Twitter
అంతకముందు కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ కూడా ధోని ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు. పుట్టినప్పటి నుంచే ధోని ఆట చూస్తూ పెరిగిన రింకూ సింగ్.. ఇవాళ తన అభిమాన ఆటగాడికి ప్రత్యర్థిగా ఆడడమే గాక ఫిఫ్టీతో మెరిసి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన అభిమాన ఆటగాడిని కలుసుకున్న రింకూ సింగ్ ధోనితో ముచ్చటించాడు. ధోని ఇచ్చిన విలువైన సలహాలను శ్రద్దగా విన్నాడు. అనంతరం తన జెర్సీపై ధోని ఆటోగ్రాఫ్‌ను పెట్టించుకున్నాడు.
MS Dhoni signing in the jersey of Rinku Singh.
— Johns. (@CricCrazyJohns) May 14, 2023
What a beautiful moment. pic.twitter.com/ugB1kPfPNE
చదవండి: 'అరె లొల్లి సల్లగుండ'.. ప్రశ్న అర్థంగాక ధోని ఇబ్బంది
Comments
Please login to add a commentAdd a comment