IPL 2023: Sunil Gavaskar Fires-Chepauk Staff Dog Delays CSK vs LSG - Sakshi
Sakshi News home page

IPL 2023: ధోని కంటే ముందే గ్రౌండ్‌లోకి .. గావస్కర్‌ చివాట్లు 

Published Tue, Apr 4 2023 6:12 PM | Last Updated on Tue, Apr 4 2023 7:04 PM

Sunil Gavaskar Fires-Chepauk Staff Dog Delays CSK vs LSG IPL 2023 Viral - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సోమవారం సీఎస్‌కే, లక్నో మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  సీఎస్‌కే ఇన్నింగ్స్‌ ఆఖర్లో.. జడేజా ఔటయ్యి పెవిలియన్‌కు వెళ్తున్నాడు.. ఇక ధోని గ్రౌండ్‌లోకి రావాల్సి ఉంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో ధోని కంటే ముందు  ఒక కుక్క అనుకోకుండా గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియక గ్రౌండ్‌ సిబ్బంది కాస్త తడబాటుకు గరయ్యారు. కుక్కను బయటికి పంపడానికి వచ్చిన ఆరుగురు సిబ్బందిని పరుగులు పెట్టించింది. చివరకు ఎలాగోలా దానిని బయటకు పంపించారు. ఇదంతా గమనించిన ధోని, జడేజాలు కాసేపు నవ్వుకున్నారు.

అయితే ఇక్కడ మరో విషయమేంటంటే.. ధోని ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది. నాలుగేళ్ల తర్వాత చెపాక్‌ స్టేడియంలో మ్యాచ్‌ ఆడుతున్న ధోనికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అతను గ్రౌండ్‌లోకి వస్తున్న సమయంలో స్టేడియం మొత్తం ధోని.. ధోని అరుపులతో దద్దరిల్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ మాత్రం ఒక కుక్కను అదుపు చేయలేని గ్రౌండ్‌ సిబ్బందికి చివాట్లు పెట్టారు. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్వవహరించిన గావస్కర్‌ ఎయిర్‌లో మాట్లాడుతూ.. 'అసలే వైడ్స్‌, నోబాల్స్‌తో టైం వేస్ట్‌ అవుతుంటే.. మధ్యలో కుక్క వల్ల కాసేపు అంతరాయం. సిబ్బంది కళ్లు గప్పి కుక్క మైదానంలోకి వచ్చిదంటేనే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇది ఏ మాత్రం సహించలేనిది. పైగా ఒక​ కుక్కను కంట్రోల్‌ చేయడానికి ఆరుగురు వచ్చారు.. ఒక్కరు పట్టుకోలేకపోయారు.. వీటి వల్ల సమయం చాలా వృథా అవుతుంది'' అంటూ కామెంట్‌ చేశాడు.

చదవండి: ఏంది ఈ అరాచకం.. రెండు సిక్సర్లకే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement