క్రికెట్ అనిశ్చితికి మారుపేరు కాగా, టి20ల్లో ఇది మరీ ఎక్కువ. గత సీజన్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ సారి టాప్–3లో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆరంభంలో సరిగా స్టార్ట్ కాని కారు ఇంజన్ తరహాలో ఉండే ముంబై ఇండియన్స్ ఇప్పుడు అందరికంటే ముందుగా క్వాలిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెరుగ్గా మొదలు పెట్టినా మధ్యలో స్పీడ్ బ్రేకర్లతో కాస్త ఇబ్బంది పడ్డ చెన్నై కూడా అగ్రస్థానంలో నిలవవచ్చు. గుజరాత్‌పై ముంబై గెలవడం కూడా ఆ జట్టుకు మేలు చేసింది.
కోల్‌కతాపై గెలిచి ఇదే జోరు కొనసాగిస్తే చెన్నై టాప్‌కు చేరవచ్చు. యువ యశస్వి చేతిలో కోల్‌కతా పూర్తిగా చిత్తయింది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మాత్రమే అతను శతకం పూర్తి చేసుకుంటే అదో అద్భుతమయ్యేది. యశస్వి సెంచరీ పూర్తి కాకుండా ఉండేందుకు కోల్‌కతా బౌలర్ ఒకరు ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ వేసేందుకు ప్రయత్నించడం ఆ జట్టు పరిస్థితిని చూపిస్తోంది. ఆ విషయాన్ని సదరు బౌలర్‌కు ఎవరైనా చెప్పి ఉంటారని ఆశిస్తున్నా.
సరైన ఆరంభాలు లభించకపోవడం కోల్‌కతా సమస్య కాగా, వారి వైఫల్యంతో మిడిలార్డర్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. మిడిల్‌లో చెన్నై స్పిన్నర్లూ వారిని కట్టడి చేయగలరు. చెన్నై వెలుగులోకి తెచ్చిన పతిరణ స్లాగ్ ఓవర్లలో తన విభిన్న శైలి బౌలింగ్‌తో చెలరేగుతున్నాడు. ప్రతీసారి చెన్నైకి రుతురాజ్, కాన్వే శుభారంభాలు అందిస్తున్నారు. శివమ్ దూబేను సీఎస్‌కే సమర్థంగా వాడుకోగలిగింది. సాధారణ ఆటగాళ్ల నుంచి కూడా స్థాయికి మించిన ప్రదర్శన రాబట్టడం ధోని కెప్టెన్సీ గొప్పతనం. స్వయంగా తానే ఆకట్టుకునే సిక్సర్లు బాది అందరినీ అలరిస్తున్నాడు. ధోని జోరు ఈ సీజన్‌కే పరిమితం కారాదని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment