IND Vs WI, 3rd T20I Highlights: Suryakumar Half Century India Beat West Indies By-7 Wickets - Sakshi
Sakshi News home page

IND Vs WI 3rd T20: సూర్యకుమార్‌ మెరుపులు.. మూడో టి20లో భారత్‌ ఘన విజయం

Published Wed, Aug 3 2022 7:06 AM | Last Updated on Wed, Aug 3 2022 10:55 AM

Suryakumar Half Century India Beat West Indies By-7 Wickets 3rd T20I - Sakshi

బాసెటెర్‌: వెస్టిండీస్‌తో మూడో టి20 మ్యాచ్‌లో భారత ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. చివర్లో రిషబ్‌ పంత్‌(26 బంతుల్లో 33 నాటౌట్‌, 3 ఫోర్లు, 1 సిక్సర్‌)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

అంతకుముందు వెస్టిండీస్‌ ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (50 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మేయర్స్, బ్రాండన్‌ కింగ్‌ (20 బంతుల్లో 20; 3 ఫోర్లు) ఓపెనింగ్‌ వికెట్‌కు 57 పరుగులు జోడించి చక్కని ఆరంభాన్నిచ్చారు. తర్వాత కెప్టెన్‌ పూరన్‌ (23 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి మేయర్స్‌ తన ధాటిని కొనసాగించాడు.

ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌), హెట్‌మైర్‌ (12 బంతుల్లో 20; 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్‌ ముందు విండీస్‌ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది.  టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్‌ 2, హార్దిక్‌ పాండ్యా, అర్షదీప్‌ చెరో వికెట్‌ తీశారు.సోమవారం రెండో టి20 మూడు గంటలు ఆలస్యమవడంతో మరుసటి రోజే జరిగిన ఈ మ్యాచ్‌ను గంటన్నర లేట్‌గా ప్రారంభించారు. ఇక ఇరుజట్ల మధ్య నాలుగో టి20 శనివారం(ఆగస్టు 6న) జరగనుంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Asia Cup 2022 Schedule: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement