ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు నామమాత్రపు మ్యాచ్‌కు సిద్దమవుతోంది. ఆదివారం బెంగళూరు వేదికగా ఐదో టీ20లో భారత-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా చివరి మ్యాచ్‌లో గెలిచి.. పరువునిలబెట్టకోవాలని వ్యహాలు రచిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు సమయం దగ్గరపడుతుండడంతో స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్‌కు విశ్రాంతి ఇవ్వాలని భారత జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆఖరి టీ20ల్లో భారత జట్టు పగ్గాలు శ్రేయస్ అయ్యర్ చేపట్టే అవకాశం ఉంది. అదే విధంగా తుది జట్టులో వారి ముగ్గురి స్ధానాల్లో తిలక్ వర్మ, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్ రానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా నిన్న(శుక్రవారం) రాయ్‌పూర్ వేదికగా వేదికగా జరిగిన నాలుగో టీ20లో 20 పరుగుల తేడాతో ఆసీస్‌ను భారత్ చిత్తు చేసింది. దీంతో సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1తో భారత్ సొంతం చేసుకుంది.
ఆసీస్‌తో ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
చదవండి: సౌతాఫ్రికా టూర్‌కు అతడిని ఎంపిక చేయాల్సింది.. ఎందుకంటే: టీమిండియా మాజీ పేసర్
Comments
Please login to add a commentAdd a comment