అతడు ప్రపంచ అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో ఒకడు: సచిన్‌ | Suryakumar Yadav Is One Of The Leading Batsmen In The World In T20s | Sakshi
Sakshi News home page

అతడు ప్రపంచ అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో ఒకడు: సచిన్‌

Published Tue, Oct 18 2022 12:40 PM | Last Updated on Tue, Oct 18 2022 2:44 PM

Suryakumar Yadav Is One Of The Leading Batsmen In The World In T20s - Sakshi

టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో కూడా సూర్య అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 6 ఫోర్లు, సిక్స్‌తో 50 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో సూర్య ఒకడని మాస్టర్‌ బ్లస్టర్‌ కొనియాడాడు. కాగా సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం​టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్ధానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు భారత్‌ తరపున 34 టీ20లు ఆడిన సూర్య.. 1045 పరుగులు సాధించాడు.

"అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్య ఎదుగుదల చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. సూర్య ఎప్పుడూ ప్రమాదకరమైన ఆటగాడే. అయితే తొలుత అతడికి జట్టులో చోటు దక్కేది కాదు. కానీ ఇప్పడు అతడే జట్టులో కీలక ఆటగాడు. ప్రస్తుతం టీ20ల్లో ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో సూర్య ఒకడు. ఈ మెగా ఈవెంట్‌లో అతడు విధ్వంసం సృష్టించడానికి సిద్దంగా ఉన్నాడు" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సచిన్‌ పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2022: ఒకే చోట కోహ్లి, బాబర్‌ నెట్‌ ప్రాక్టీస్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement