
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లోనే తన రెండో అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 51 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
కాగా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సూర్యకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఏడాదిలో సూర్యకు ఇది 7వ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు కావడం గమానార్హం. తద్వారా సూర్య ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలండర్ ఈయర్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ఆటగాడిగా సూర్య నిలిచాడు.
ఇక అంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(6) పేరిట ఉండేది. కాగా ఓవరాల్‌గా ఒక క్యాలండర్ ఈయర్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా(7) రికార్డును కూడా సూర్య చేశాడు. ఇక ఆఖరి టీ20లో కూడా సూర్య ఇదే జోరును కనబరిచి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిస్తే రజా రికార్డు బద్దలు అవుతోంది.
చదవండి: IND vs NZ: సూర్యకుమార్ బ్యాటింగ్ చూడలేకపోయారా? ఇది మీ కోసమే!.. ట్రెండింగ్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment