T20 WC 2022: Babar Azam Meet Sunil Gavaskar Get Advice, Video Viral - Sakshi
Sakshi News home page

T20 WC: టీమిండియా దిగ్గజాన్ని కలిసిన బాబర్‌ ఆజం.. విలువైన సలహా ఇచ్చిన లెజెండ్‌!

Published Mon, Oct 17 2022 7:18 PM | Last Updated on Mon, Oct 17 2022 8:11 PM

T20 WC 2022: Babar Azam Meet Sunil Gavaskar Get Advice Video Viral - Sakshi

సునిల్‌ గావస్కర్‌ను కలిసిన బాబర్‌ ఆజం(PC: PCB)

T20 World Cup 2022- Sunil Gavaskar- Babar Azam: టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో టీమిండియాతో పోరుకు ముందు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా లిటిల్‌ మాస్టర్‌.. పాక్‌ సారథితో ఆత్మీయంగా ముచ్చటించాడు. అంతేగాకుండా అతడి క్యాప్‌పై తన ఆటోగ్రాఫ్‌ ఇచ్చి ఖుషీ చేశాడు ఈ కామెంటేటర్‌. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కాగా ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచకప్‌-2022 జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీలంక- నమీబియా మధ్య ఆదివారం తొలి మ్యాచ్‌ జరుగగా.. పాకిస్తాన్‌ సోమవారం ఇంగ్లండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌కు బాబర్‌ ఆజం దూరంగా ఉండగా... షాబాద్‌ ఖాన్‌ సారథిగా వ్యవహరించాడు.

ఇదిలా ఉంటే.. గావస్కర్‌ను కలిసిన బాబర్‌ ఆజం అతడితో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా... ‘‘నీ పుట్టిన రోజు ఎప్పుడు? ఈరోజా లేదంటే నిన్ననే అయిపోయిందా? అని అడుగగా.. బాబర్‌ నిన్న(అక్టోబరు 15)నే అయిపోయిందంటూ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత టీమిండియా దిగ్గజం.. ‘‘నీ షాట్‌ సెలక్షన్‌ బాగుందంటే.. ఇక ఏ సమస్యా ఉండదు’’ అంటూ ఆటలోని మెళకువల గురించి సలహాలు ఇచ్చాడు.

ప్రస్తుతం.. వీరిద్దరి ఫొటోలుసోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పాక్‌తో మ్యాచ్‌కు ముందు సునిల్‌ గావస్కర్‌ ఇలా బాబర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా వార్మప్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో పాకిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌లో పాక్‌ అక్టోబరు 23న భారత్‌తో ఆరంభ మ్యాచ్‌ ఆడనుంది. 

చదవండి: Rohit Sharma: ఆఖరి ఓవర్‌ షమీతో వేయించడానికి కారణం అదే.. చాలెంజింగ్‌గా ఉంటేనే!
T20 WC 2022: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తప్పదా? ఇంతకీ అతడికి ఏమైంది?
T20 WC 2022: రోహిత్‌ నాకంటే పెద్దవాడు! ఇంట్లో వాళ్లు బాగున్నారా? ఏ కారు కొంటున్నావు.. మేము మాట్లాడుకునేది ఇవే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement