టీ20 వరల్డ్‌కప్-2022లో నిన్న (అక్టోబర్ 23) పాక్‌తో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన విరాట్ కోహ్లి (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు).. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల మనసులు కొల్లగొట్టడంతో పాటు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (14) సాధించిన క్రికెటర్‌గా, టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (6) అందుకున్న క్రికెటర్‌గా, టీ20ల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక సార్లు నాటౌట్‌గా (18) నిలిచిన క్రికెటర్‌గా, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (110 మ్యాచ్‌ల్లో 3,794) చేసిన క్రికెటర్‌గా, ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (24) చేసిన భారత ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డులతో పాటు విరాట్ నిన్నటి మ్యాచ్‌లో మరో ఘనత సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కు నెట్టి ఆరో స్థానానికి ఎగబాకాడు. విరాట్ మొత్తం 528 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 53.80 సగటున 24,212 పరుగులు (71 సెంచరీలు, 126 హాఫ్ సెంచరీలు) చేయగా.. ద్రవిడ్ 509 ఇన్నింగ్స్‌లో 45.41 సగటున 24,208 పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (34,357) అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (28,016), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (27,483), శ్రీలంక లెజెండ్ మహేల జయవర్దనే (25,957), దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్ కలిస్ (25,534) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు.
చదవండి: IND VS PAK: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment