టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి ప్రస్తుత తరంలో ఒక గొప్ప ఆటగాడు. ఇప్పటికే తన పేరు మీద లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు. తాను ఫామ్‌లో ఉండాలే కానీ రికార్డులు వాటంతట అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. తాజాగా టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో కోహ్లి ముంగిట అరుదైన రికార్డు ఎదరుచూస్తుంది. ఐసీసీ టోర్నీల్లో కోహ్లి సచిన్‌తో కలిసి ఇప్పటివరకు 23 అర్థసెంచరీలు సాధించాడు. పాక్‌తో మ్యాచ్‌లో గనుక కోహ్లి ఫిఫ్టీతో మెరిస్తే సచిన్‌ను అధిగమించనున్నాడు.ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన తొలి టీమిండియా ఆటగాడిగా కోహ్లి నిలవనున్నాడు.
ఇక వరల్డ్‌కప్స్ విషయానికి వస్తే సచిన్ ఖాతాలో ఏడు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లి ఖాతాలో రెండు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్‌కు, కోహ్లికి ఉన్న తేడా ఏంటంటే.. మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్‌లో కేవలం వన్డే వరల్డ్‌కప్‌లు మాత్రమే ఆడగా.. కోహ్లి మాత్రం అటు వన్డే వరల్డ్‌కప్‌తో పాటు టి20 ప్రపంచకప్‌లు కూడా ఆడాడు.
ఇక కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమవుతూ వచ్చిన కోహ్లి ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్‌ల్లో కోహ్లి మంచి ప్రదర్శన కనబరిచాడు. కీలకమైన టి20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి ఫామ్‌లో ఉండడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది.
చదవండి: హార్దిక్ పాండ్యాకు ఏమైంది.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటేనా!
Comments
Please login to add a commentAdd a comment