టీమిండియాకు రెండో ఓటమి.. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
సమయం: 22:37.. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ డారిల్ మిచెల్ 49 పరుగులతో రాణించాడు. విలియమ్సన్ 33 మిగతాపనిని పూర్తి చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. తాజా ఓటమితో టీమిండియా సూపర్ 12 వరుసగా రెండో ఓటమిని చవిచూసి సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. కివీస్ మాత్రం విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఆరంభం నుంచి న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా బ్యాటర్స్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. రవీంద్ర జడేజా 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా 23 పరుగులు చేశాడు. మిగిలిన టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఇష్ సోథీ 2, సౌథీ, మిల్నేలు చెరో వికెట్ తీశారు.
విజయానికి 22 పరుగుల దూరంలో..
సమయం: 22:11.. టీమిండియాతో మ్యాచ్‌లో కివీస్ విజయం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 48, విలియమ్సన్ 19 పరుగులతో ఆడుతున్నారు.
సమయం: 21:51.. తొలి వికెట్ కోల్పోయినప్పటికీ న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. మిచెల్ 29, విలియమ్సన్ 11 పరుగులతో ఆడుతున్నారు.
మార్టిన్ గప్టిల్(20) ఔట్.. 5 ఓవర్లలో న్యూజిలాండ్ 30/1
సమయం: 21:38.. మార్టిన్ గప్టిల్(20) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో గప్టిల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక 111 పరగులు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 5, కేన్ విలియమ్సన్ 2 పరుగుతో ఆడుతున్నారు.
సమయం: 21:12.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఆరంభం నుంచి న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా బ్యాటర్స్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. రవీంద్ర జడేజా 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా 23 పరుగులు చేశాడు. మిగిలిన టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఇష్ సోథీ 2, సౌథీ, మిల్నేలు చెరో వికెట్ తీశారు.
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
సమయం: 21:00.. టీమిండియాను బౌల్ట్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. అంతకముందు ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా(23) గప్టిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. పంత్(12) ఔట్
సమయం 20:41.. ఇన్నింగ్స్ 14.3వ ఓవర్‌లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. మిల్నే బౌలింగ్‌లో రిషబ్ పంత్(19 బంతుల్లో 12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా టీమిండియా 70 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. క్రీజ్‌లో హార్ధిక్ పాండ్యా(11), రవీంద్ర జడేజా ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. కోహ్లి(9) ఔట్
సమయం 20:19.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగుతున్నాయి. ఐష్ సోధి వేసిన 11వ ఓవర్ తొలి బంతికి కెప్టెన్ కోహ్లి(17 బంతుల్లో 9) పేలవ షాట్ ఆడి బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 48 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో పంత్(6 బంతుల్లో 3), హార్ధిక్ పాండ్యా ఉన్నారు.
కష్టాల్లో టీమిండియా.. రోహిత్ శర్మ(14) ఔట్
సమయం 20:06.. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఎదురీదుతున్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ(14 బంతుల్లో 14; ఫోర్, సిక్స్) ఐష్ సోధి బౌలింగ్‌లో గప్తిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 40 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 41/3. క్రీజ్‌లో కోహ్లి(8 బంతుల్లో 4), రిషబ్ పంత్(2 బంతుల్లో 1) ఉన్నారు.
కేఎల్ రాహుల్(18) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్(4) ఔట్.. టీమిండియా 14/1
ఇషాన్ కిషన్(4) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ ఐదో బంతిని భారీ షాట్‌కు యత్నించి డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 7, రోహిత్ శర్మ 2 పరుగులతో ఆడుతున్నారు.
టీమిండియా 2 ఓవర్లలో 6/0
సమయం: 19:39.. 2 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 6, ఇషాన్ కిషన్ 0 పరుగులతో ఆడుతున్నారు.
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో సూపర్ 12 గ్రూఫ్ 2లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా, న్యూజిలాండ్‌కు తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకంగా మారింది. ఓడిన జట్టుకు సెమీస్ అవకాశాలు క్లిష్టమవనున్నాయి. ఇక టీమిండియా జట్టులో రెండు మార్పులు జరిగాయి. సూర్యకుమార్, భువనేశ్వర్ స్థానాల్లో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు.
ఇక 2003 వన్డే వరల్డ్‌కప్ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించలేకపోయింది. 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్... 2021 టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్... గత రెండు ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ జట్టు భారత్‌ను దెబ్బ కొట్టి అభిమానుల ఆశలు గల్లంతు చేసింది. మరింత వెనక్కి వెళితే గత టి20 ప్రపంచకప్‌లో కూడా భారత్‌ను సొంతగడ్డపైనే చిత్తు చేసింది. ఓవరాల్‌గా చూస్తే ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... కివీస్ ఎంత ప్రమాదకర ప్రత్యర్థో కోహ్లి సేనకు బాగా తెలుసు.
ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ 7-1 తేడాతో టీమిండియాపై ఆధిక్యంలో ఉంది. మరి కోహ్లి సేన 18 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక టి20ల్లో ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగ్గా.. చెరో 8 మ్యాచ్‌లు నెగ్గడం విశేషం.
టీమిండియా: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేమ్స్ నీషమ్, డెవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment