భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులో అనూహ్య మార్పు..  | T20 World Cup 2021: Shardul Thakur Replaces Axar Patel In India Squad | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు..

Published Wed, Oct 13 2021 6:02 PM | Last Updated on Wed, Oct 13 2021 8:15 PM

T20 World Cup 2021: Shardul Thakur Replaces Axar Patel In India Squad - Sakshi

Shardul Thakur Replaces Axar Patel In Team India T20 World Cup Squad: టీమిండియా టీ20 ప్రపంచకప్‌ జట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఇదివరకే ప్రకటించిన 15 మంది రెగ్యులర్‌ సభ్యుల్లో ఒకడైన అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో స్టాండ్‌ బై ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌కు చోటు కల్పిస్తూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అక్ష‌ర్ ప‌టేల్ స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతాడని బీసీసీఐ పేర్కొంది. ఈ కీలక మార్పుతో పాటు మరో 8 మంది ఆటగాళ్లను జట్టుతో పాటే ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది.

దీంతో అవేష్ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షల్‌ పటేల్‌, లుక్మాన్‌ మేరీవాలా, వెంక‌టేశ్ అయ్య‌ర్‌, కర్ణ శర్మ, షాబాజ్‌ అహ్మద్‌, కృష్ణప్ప గౌతమ్‌లు టీమిండియాతో పాటే యూఏఈలో ఉండనున్నారు. కాగా, ఈ నెల 17 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 24న దాయాది పాకిస్థాన్‌తో టీమిండియా త‌మ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 

భారత టీ 20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్‌ కెప్టెన్‌),  కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ.

రిజర్వ్‌ ఆటగాళ్లు: శ్రేయాస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, అక్షర్‌ పటేల్‌


చదవండి: టీమిండియా కోచ్‌ రేసులో 'ఆ ముగ్గురు'.. విదేశీయులకు నో ఛాన్స్‌ అన్న బీసీసీఐ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement