PC: BCCI
T20 WC Team India Schedule: పాకిస్తాన్‌తో పోరుతో టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021 వేట మొదలుకానుంది. సూపర్ 12లో భాగంగా అక్టోబరు 24న దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌తో కోహ్లి సేన మెగా టోర్నీ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, గ్రూపు-బి టాపర్, గ్రూపు-ఏలోని రెండో టాపర్‌తో భారత జట్టు తలపడనుంది.
►ఇక అంతకంటే ముందు అక్టోబరు 18న ఇంగ్లండ్, అక్టోబరు 20న ఆస్ట్రేలియాతో టీమిండియా వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.
టీ20 వరల్డ్‌కప్-2021 విశేషాలు:
‘డీఆర్‌ఎస్’ తొలిసారి...
►2016లో టీ20 వరల్డ్‌కప్ జరిగినప్పుడు డీఆర్‌ఎస్ పద్ధతి లేదు. ఇప్పుడు మొదటిసారిగా దీనిని ఉపయోగించనున్నారు. ఒక్కో ఇన్నింగ్స్‌లో జట్టుకు రెండు రివ్యూ అవకాశాలు ఉంటాయి.
150 సెకన్ల విరామం...
►వరల్డ్‌కప్‌లో తొలిసారి ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో ఇన్నింగ్స్‌లో 2 నిమిషాల 30 సెకన్ల పాటు డ్రింక్స్ బ్రేక్ ఇస్తున్నారు. సరిగ్గా 10 ఓవర్ల తర్వాతే ఇది ఉంటుంది.
రిజర్వ్ డే...
►సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే ‘రిజర్వ్ డే’లు ఉన్నాయి. ఇప్పటి వరకు టి20ల్లోని నిబంధన ప్రకారం... ఒక్కో ఇన్నింగ్స్ కనీసం 5 ఓవర్లు సాగినా ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ ద్వారా నిర్ధారిస్తారు. అయితే ఈసారి స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల్లో మాత్రం ఒక్కో జట్టు కనీసం 10 ఓవర్లు ఆడితే డక్‌వర్త్ లూయిస్‌ను వర్తింపజేస్తారు.
మ్యాచ్ ‘టై’ అయితే...
►మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అందులోనూ సమంగా నిలిస్తే ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్లు ఆడిస్తారు. ఫైనల్లో ఏదైనా కారణం చేత సూపర్ ఓవర్లలోనూ ఫలి తం రాకపోతే సంయుక్తవిజేతగా ప్రకటిస్తారు.
►టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా:
మ్యాచ్ | తేదీ | సమయం | వేదిక | రౌండ్ |
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ | అక్టోబరు 24 | రాత్రి 7: 30 నిమిషాలకు | దుబాయ్ | సూపర్ 12 |
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ | అక్టోబరు 31 | 7: 30 నిమిషాలకు | దుబాయ్ | సూపర్ 12 |
ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ |
నవంబరు 3 | 7: 30 నిమిషాలకు | అబుదాబి | సూపర్ 12 |
ఇండియా వర్సెస్ B1 | నవంబరు 5 | 7: 30 నిమిషాలకు | దుబాయ్ | సూపర్ 12 |
ఇండియా వర్సెస్ A2 | నవంబరు 8 | 7: 30 నిమిషాలకు | దుబాయ్ | సూపర్ 12 |
ఇండియా- సూపర్ 12, గ్రూప్-2
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, దీపక్ చహర్, అక్షర్ పటేల్.
Comments
Please login to add a commentAdd a comment