T20 World Cup 2022: నెదర్లాండ్స్‌పై బంగ్లా గెలుపు | T20 World Cup 2022: Bangladesh beat Netherlands by 9 runs | Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: నెదర్లాండ్స్‌పై బంగ్లా గెలుపు

Published Wed, Oct 26 2022 5:16 AM | Last Updated on Wed, Oct 26 2022 5:16 AM

T20 World Cup 2022: Bangladesh beat Netherlands by 9 runs - Sakshi

హోబర్ట్‌: టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌–2లో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 9 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. మొదట బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అఫీఫ్‌ హొస్సేన్‌ (27 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నజ్ముల్‌ హొస్సేన్‌ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు), మొసాదిక్‌ (12 బంతుల్లో 20 నాటౌట్‌; 1 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. పాల్‌ వాన్, డి లీడే చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 135 పరుగుల వద్ద ఆలౌటైంది. కొలిన్‌ అకెర్‌మన్‌ (48 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), పాల్‌ వాన్‌ మీకెరన్‌ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా లాభం లేకపోయింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తస్కీన్‌ అహ్మద్‌ (4/25) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.  

సఫారీకి వర్షం దెబ్బ
ఇదే గ్రూప్‌లో దక్షిణాఫ్రికా గెలిచే మ్యాచ్‌కు వర్షం షాకిచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించగా, ఆట మధ్యలో అది 7 ఓవర్ల మ్యాచ్‌గా మారింది. అయితే చివరకు అదీ సాధ్యం కాక మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. మొదట జింబాబ్వే 9 ఓవర్లలో 5 వికెట్లకు 79 పరుగులు చేసింది. 7 ఓవర్లలో 64 పరుగుల లక్ష్యంగా మార్చారు. కానీ 3 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్‌ కోల్పోకుండా 51 పరుగులు చేసి గెలిచేందుకు సిద్ధమైతే... మళ్లీ కురిసిన వాన మ్యాచ్‌ను ముంచెత్తింది. డికాక్‌ (18 బంతుల్లో 47 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ వర్షార్పణమైంది. తొలి 2 ఓవర్లు తనే ఎదుర్కొన్న డికాక్‌ వరుసగా 4, 4, 4, 6, 4, 1, నోబాల్, 0, 4, 4, 4, 0, 4 బాదడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement