T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్‌ | Rohit Sharma Comments After Team India Win Against Australia In Super 8 Match | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్‌

Published Tue, Jun 25 2024 8:06 AM | Last Updated on Tue, Jun 25 2024 10:54 AM

T20 World Cup 2024: Rohit Sharma Comments After Team India Win Against Australia In Super 8 Match

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా నిన్న (జూన్‌ 24) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. 

హిట్‌మ్యాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా 181 పరుగులకే ( 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరిమితమై 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

ట్రవిస్‌ హెడ్‌ (76) ఆసీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/37), కుల్దీప్‌ యాదవ్‌ (2/24) ఆసీస్‌ విజయాన్ని అడ్డుకున్నారు. బుమ్రా, అక్షర్‌ తలో వికెట్‌ తీశారు. సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగి టీమిండియాను గెలిపించిన రోహిత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

మ్యాచ్‌ అనంతరం హిట్‌మ్యాన్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు చాలా సంతృప్తిని, ఉత్సాహాన్నిచ్చింది. ప్రత్యర్ధి ఎంత ప్రమాదకమైందో తెలుసు. కలిసికట్టుగా ఆడాలకున్నాం. అలాగే చేశాం. 200 చాలా మంది స్కోర్‌. ఇక్కడ గాలి చాలా బిగ్‌ ఫాక్టర్‌. ఏమైనా జరిగి ఉండవచ్చు. అయితే మేము అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకున్నాం. వ్యక్తిగతంగానూ అందరూ రాణించారు. 

సరైన సమయాల్లో వికెట్లు పడగొట్టడం ‍ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. కుల్దీప్‌ బలం గురించి బాగా తెలుసు. అతన్ని సరైన సమమంలో వినియోగించుకోవాలి. అమెరికా ఫేస్‌లో పిచ్‌లు పేసర్లకు అనుకూలించేవి. అందులో కుల్దీప్‌కు అక్కడ అవకాశాలు దక్కలేదు. 

వ్యక్తితంగా నా బ్యాటింగ్‌ విషయానికొస్తే.. చాలా సంతృప్తినిచ్చిన ఇన్నింగ్స్‌ ఇది. సెంచరీ గురించిన ఆలోచనే లేదు. మొదటి నుంచి ఎలా ఆడానో (వేగంగా) అలాగే ఆడాను. స్టార్క్‌ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. సెమీస్‌ విషయానికొస్తే.. కొత్తగా ఏమీ ట్రై చేయాలని అనుకోవట్లేదు. టోర్నీ ఇప్పటివరకు ఎలా ఆడామో అలాగే ఆడతాం. ఎవరేమీ చేయాలో ప్లాన్‌ చేసుకుంటాం. మున్ముందు ఏం జరుగుతుందో పెద్ద ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడతాం. ప్రత్యర్ధి గురించి పెద్దగా ఆలోచన లేదు. జట్టుగా ఇదే మా ప్రణాళిక. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement