చెన్నై: ఇంగ్లండ్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి ఇంకా 381 పరుగులు కావాలి. ఈ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. నాల్గో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌటైంది. దాంతో టీమిండియాకు 420 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(12) వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. జాక్ లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. అనంతరం చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌కు వచ్చాడు. సోమవారం ఆట ముగిసే సమయానికి శుబ్‌మన్ గిల్(15 బ్యాటింగ్), పుజారా(12 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు.
వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ రెండొందల పరుగుల మార్కు చేరకుండా కట్టడి చేశాడు. కాగా, తన టెస్టు కెరీర్‌లో ఐదు వికెట్ల మార్కును చేరడం అశ్విన్‌కు ఇది 28వ సారి కాగా ఇంగ్లండ్‌పై నాల్గోసారి. ఇక చెన్నై స్టేడియంలో మూడోసారి కావడం మరో విశేషం. అయినప్పటికీ ఇంగ్లండ్ 419 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బర్న్స్, సిబ్లే, స్టోక్స్, డొమినిక్ బెస్, జోఫ్రా ఆర‍్చర్, అండర్సన్ వికెట్లను అశ్విన్ సాధించాడు. ఇక నదీమ్‌కు రెండు వికెట్లు లభించగా, ఇషాంత్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగులు చేయగా, టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ జో రూట్ 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ చేసిన పరుగులే అత్యధిక స్కోరుగా నిలిచింది. ఆ తర్వాత ఓలీ పాప్(28), బెస్(25), బట్లర్(24)లు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లు.
ఇక్కడ చదవండి: ఆ అవార్డు రిషభ్ పంత్‌దే..
Comments
Please login to add a commentAdd a comment