వన్డే ప్రపంచకప్-2023కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 5న చెన్నై వేదికగా జరగనున్న ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు 10 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
హైదరాబాద్‌లో మూడు మ్యాచ్‌లు మినహా మిగిలిన అన్ని వేదికలు కూడా ఐదు మ్యాచ్‌లు, అంతకుపైనే ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అందులో కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఒకటి. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్‌లు ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తామని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ తెలిపారు.
మేము ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చాం. కానీ ఈసారి రెండు పాక్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈడెన్‌లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ వంటి పటిష్ట జట్టులతో ఆడనుంది. ప్రపంచకప్ వంటి ఈవెంట్‌ను నిర్వహించడం అంత ఈజీ కాదు, సవాలుతో కూడుకున్నది. అయితే లాంటి ఛాలెంజ్‌నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ మ్యాచ్‌లకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నాం.
పాకిస్తాన్ గతంలో కోలకతాలో చాలా మ్యాచ్‌లు ఆడింది. అందుకే వారు మొదటి ప్రాధాన్యత కోల్‌కతాకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత వారు చెన్నై, బెంగళూరు వంటి వేదికలలో ఆడాలని డిమాండ్ చేశారు అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహాశిష్ గంగూలీ పేర్కొన్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 15న జరగనుంది.
చదవండి: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!
Comments
Please login to add a commentAdd a comment