టీ20 అరంగేట్రంలోనే అదరగొట్టిన భారత యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా ఆసియాకప్-2023 భారత జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కాదని తిలక్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఇక 20ఏళ్ల తిలక్ వర్మ ప్రస్తుతం ఐర్లాండ్‌లో ఉన్నాడు.
ఐరీష్‌తో టీ20 సిరీస్‌లో తలపడుతున్న భారత జట్టులో తిలక్ భాగంగా ఉన్నాడు. బుధవారం ఆఖరి టీ20తో ఐర్లాండ్ పర్యటన ముగుస్తుంది. అక్కడ నుంచి తిలక్ నేరుగా జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. ఏన్సీలో ఆగస్టు 24 నుంచి జరగనున్న స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గోనున్నాడు. ఇక ఆసియాకప్‌కు ఎంపిక కావడంపై తిలక్ వర్మ స్పందించాడు. ఆసియాకప్ వంటి మెగా టోర్నీకి సెలక్ట్ కావడం చాలా సంతోషంగా ఉందని తిలక్ తెలిపాడు.
"ఆసియాకప్ వంటి మెగా ఈవెంట్‌తో వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేస్తానని అస్సలు అనుకోలేదు. భారత్ తరఫున వన్డేల్లో డెబ్యూ చేయాలని నేను ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. నా కల త్వరలోనే నేరవేరనుంది. ఇది నాకు చాలా పెద్ద విషయం. నేను ఈ ఏడాదిలోనే టీ20ల్లో డెబ్యూ చేశాను. నెల తిరగకముందే సడన్‌గా ఆసియాకప్ వంటి మెగా టోర్నీకి ఎంపిక చేశారు. చాలా సంతోషంగా ఉంది.
నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అందుకు తగ్గట్టు సిద్దమవుతాను. ఐపీఎల్ సమయంలో నేను చాలా ఒత్తడికి గురయ్యాను. రోహిత్ భాయ్ నాకు సపోర్ట్‌గా నిలిచాడు. ఎటువంటి భయం లేకుండా, నాకు నచ్చిన విధంగా ఆడమని సలహా ఇచ్చాడు. అదే విధంగా నాకు ఎటువంటి సందేహాలు ఉన్న తనని ఆడగమనేవాడు. నేను అతడి నుంచి చాలా విషయాలు నేర్చకున్నాడు. బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్ పేర్కొన్నాను.
చదవండి: IND vs IRE: అయ్యో రింకూ.. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్! బుమ్రా మంచి మనసు
Comments
Please login to add a commentAdd a comment