
టీమిండియా యువ క్రికెటర్, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను తిలక్ వర్మ గురువారం షేర్ చేశాడు.
ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2023-24 ప్లేట్ గ్రూప్ చాంపియన్‌గా హైదరాబాద్ అవతరించిన విషయం తెలిసిందే. తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ ఫైనల్లో మేఘాలయను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. అదే విధంగా వచ్చే ఏడాది ఎలైట్ గ్రూపులో తలపడే అవకాశం దక్కించుకుంది.
తిలక్ వర్మ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించి జట్టుకు ఈ మేరకు విజయాలు అందించాడు. ఇక తదుపరి అతడు ఐపీఎల్-2024తో బిజీ కానున్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ వర్మ త్వరలోనే జట్టు శిక్షణా శిబిరంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
కాగా అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన తిలక్ వర్మను ఐపీఎల్-2022కు ముందు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గత రెండు సీజన్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. వరుసగా 397, 343 పరుగులు సాధించాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన తిలక్ వర్మ వెస్టిండీస్‌తో 2023 టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టీ20లు, 4 వన్డేలు ఆడి .. ఆయా ఫార్మాట్లలో 336, 68 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment