Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ రుతురాజ్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ ఏడు పరుగులు చేసి అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో 12.6 సగటుతో 63 పరుగులు మాత్రమే చేశాడు.
బ్యాటర్‌గానే గాక కెప్టెన్‌గానూ రుతురాజ్ ఫెయిలవుతున్నాడు. సీఎస్‌కే ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించి మూడింట ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో రుతురాజ్ కెప్టెన్సీ సహా వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు పెరిగిపోతున్నాయి. దీంతో రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంటే బాగుంటుందని క్రీడా పండితులు సూచిస్తున్నారు.
వన్‌డౌన్‌లో వస్తున్న ఆయుశ్ మాత్రేకు ప్రమోషన్ ఇచ్చి ఓపెనర్‌గా పంపితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంటాడేమో చూడాలి. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
శాంసన్ (48) టాప్ స్కోరర్‌గా నిలవగా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్‌లు తలా ఒక వికెట్ తీశారు.


