టోక్యో: ఒలింపిక్స్‌లో చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చెన్ యూ ఫెయ్ పసిడితో మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో చెన్ యూ ఫెయ్ 21-18, 19-21, 21-18 తేడాతో చైనీస్ తైపీ ప్లేయర్ తై జూ-యింగ్‌పై గెలిచి స్వర్ణాన్ని ముద్దాడింది. హోరాహోరీగా సాగిన పోరులో చెన్ యూ ఫెయ్ విజేతగా నిలిచింది. ఫలితంగా తొలిసారి స్వర్ణాన్ని గెలవాలనుకున్న తై జూ యింగ్ రజతంతో సరిపెట్టుకుంది.
మహిళల సింగిల్స్ ఫైనల్లో భాగంగా తొలి గేమ్‌ను గెలిచిన చెన్ యూ ఫెయ్.. ఆపై రెండో గేమ్‌లో ఓటమి పాలైంది. ఇరువురి మధ్య తొలి రెండు గేమ్‌లు నువ్వా-నేనా అన్నట్లు సాగగా, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చెన్ యూ ఫెయ్ ఆధిపత్యం కనబరిచి బంగారు పతకాన్ని గెలుచుకుంది. కాగా, పీవీ సింధు కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment