
మా లాంగ్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు దుమ్మురేపారు. వరుసగా నాలుగో ఒలింపిక్ క్రీడల్లోనూ స్వర్ణ, రజత పతకాలను చైనా ప్లేయర్లే సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా చైనాకు చెందిన మా లాంగ్ దుమ్మురేపాడు.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మా లాంగ్ 11–4, 10–12, 11–8, 11–9, 3–11, 11–7తో చైనాకే చెందిన ప్రపంచ నంబర్‌వన్ ఫాన్ జెన్‌డాంగ్‌ను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment