లీడ్స్: ‘యాషెస్’ సిరీస్ మూడో టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డకెట్ (18 నాటౌట్), క్రాలీ (9 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఆ జట్టు మరో 224 పరుగులు చేయాల్సి ఉంది.
లక్ష్యం చిన్నదిగానే కనిపిస్తున్నా పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా మారుతున్న స్థితిలో ఆసీస్ పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని ఇంగ్లండ్ ఎలా ఛేదిస్తుందనేది ఆసక్తికరం. శనివారం వాన టెస్టుకు తీవ్ర అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా తొలి సెషన్‌లో ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా... మొత్తం 25.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
ఓవర్‌నైట్ స్కోరు 116/4తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో ఆసీస్‌కు పరుగులు రావడం కష్టంగా మారింది. 20.1 ఓవర్లలోనే ఆ జట్టు మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ ట్రవిస్ హెడ్ (112 బంతుల్లో 77; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పట్టుదలగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. అతనికి కొద్ది సేపు మిచెల్ మార్‡్ష (28) అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, వోక్స్ చెరో 3 వికెట్లు పడగొట్టగా...మొయిన్ అలీ, మార్క్‌వుడ్ చెరో 2 వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment