Under-19 Women cricket: సిరీస్‌ భారత మహిళల సొంతం | Under-19 Women cricket: India defeats South Africa by Four wickets in fourth match of five-match series | Sakshi
Sakshi News home page

Under-19 Women cricket: సిరీస్‌ భారత మహిళల సొంతం

Jan 3 2023 6:18 AM | Updated on Jan 3 2023 6:18 AM

Under-19 Women cricket: India defeats South Africa by Four wickets in fourth match of five-match series - Sakshi

ప్రిటోరియా: దక్షిణాఫ్రికా మహిళల (అండర్‌–19)తో జరిగిన టి20 సిరీస్‌లో భారత మహిళలు (అండర్‌–19) పైచేయి సాధించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకున్నారు. సోమవారం జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ టీమ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 86 పరుగులే చేయగలిగింది.

కేలే రెనెకే (18) టాప్‌ స్కోరర్‌గా నిలవగా...భారత బౌలర్లలో నజీలా సీఎంసీ (3/4), ఫలక్‌ నాజ్‌ (2/11) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. అనంతరం భారత్‌ 15 ఓవర్లలో 6 వికెట్లకు 87 పరుగులు సాధించింది. కెప్టెన్‌ షఫాలీ వర్మ (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ గెలవగా, తర్వాతి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సిరీస్‌లో చివరి మ్యాచ్‌ రేపు జరుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement