జొకోవిచ్‌కు షాక్‌  | Novak Djokovic lost to Luca Nardi in the third round of the Indian Wells Masters. - Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌కు షాక్‌ 

Published Wed, Mar 13 2024 5:26 AM | Last Updated on Wed, Mar 13 2024 11:57 AM

An unexpected defeat for Djokovic - Sakshi

ఇటలీ ప్లేయర్‌ లూకా నార్దీ సంచలనం  

కాలిఫోర్నియా: ఐదేళ్ల తర్వాత ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ –1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. టాప్‌ సీడ్‌ హోదాలో పోటీపడ్డ ఈ సెర్బియా దిగ్గజం పోరాటం మూడో రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ 123వ ర్యాంకర్‌ లూకా నార్దీ మూడో రౌండ్‌లో 6–4, 3–6, 6–3తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నార్దీ ఆరు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, జొకోవిచ్‌ సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. ఈ గెలుపుతో మాస్టర్స్‌ సిరీస్, గ్రాండ్‌స్లామ్‌ టోర్నిలలో జొకోవిచ్‌ను ఓడించిన అతి తక్కువ ర్యాంకర్‌గా నార్దీ గుర్తింపు పొందాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement