Photo Credit: Twitter
సొంతగడ్డపై ఫెవరెట్‌గా బరిలోకి దిగిన విలియమ్స్ సిస్టర్స్ (సెరెనా, వీనస్) యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశపరిచారు. టోర్నీలో భాగంగా ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా-వీనస్ జోడి 3-6, 7-6 (8-6), 6-7 (7-10)పై మాయా జాయింట్ (ఆస్ట్రేలియా)-చాన్ హావో-చింగ్ (తైవాన్) జంట విజయం సాధించింది.
అయితే తొలి సెట్‌ను ఓడినప్పటికీ, రెండో సెట్‌ను టై బ్రేక్‌లో సొంతం చేసుకున్న వీనస్ జోడీ కీలకమైన మూడో సెట్‌లోనూ పోరాడింది. దీంతో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. అయితే ఒత్తిడికి లోనైన వీనస్-సెరెనా ద్వయానికి ఓటమి తప్పలేదు. ఇక విలియమ్స్ సిస్టర్స్ ఇద్దరు కలిసి డబుల్స్‌లో 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తే అందులో రెండు యూఎస్ ఓపెన్ ఉన్నాయి.
ఇక చివరగా వీనస్-సెరెనా జోడీ 2018లో డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తర్వాత వీనస్, సెరెనాలు డబుల్స్‌లో ఆడడం మళ్లీ ఇదే. ఇక మహిళల సింగిల్స్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన సెరెనా విలియమ్స్ 23 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచింది. విలియమ్స్ సిస్టర్స్ మ్యాచ్ ఓడినప్పటికీ స్టేడియంలోని ప్రేక్షకులు మాత్రం వారిద్దరికి కరతాళధ్వనులతో వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాజ్, మెద్వెదెవ్, అలెగ్జాండర జ్వెరెవ్ సహా బెంజమిన్ షెల్టన్, టియాఫో, టేలర్ ప్రిట్జ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్‌లో స్వితోలినాకు కలిన్‌స్కాయా షాక్ ఇవ్వగా, నొస్కోవా, నవ్వారోలు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు.
Serena and Venus Williams wave goodbye to the US Open crowd.
Leaving with smiles on their faces.
The sisters who changed the sport as we know it…
What a gift that we got to watch them side by side again in 2026.
🥹 pic.twitter.com/OvykarYi15— The Tennis Letter (@TheTennisLetter) September 5, 2026
చదవండి: రోహిత్ కొత్త అవతారం.. ‘రిటైర్మెంట్ తర్వాత చేసే పని ఇదేనా’


