ఆసియాకప్-2023కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-నేపాల్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా ప్రకటించింది. మరోవైపు నేపాల్ జట్టు తొలిసారి ఆసియాకప్‌లో పాల్గొంటుంది.
సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి..
ఇక భారత జట్టు విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్2న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు బుధవారం శ్రీలంకకు పయనమైంది.
ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో 102 పరుగులు సాధిస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు.
ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 321 ఇన్నింగ్స్‌లలో ఈ మైలు రాయిని అందుకున్నాడు. కోహ్లి ప్రస్తుతం 265 ఇన్నింగ్స్‌లలో 12898 పరుగులు చేశాడు.
చదవండి: Litton Das Rule Out Of Asia Cup: ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్..
Comments
Please login to add a commentAdd a comment