Photo: IPL Twitter
ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఏడువేల పరుగులు మార్క్‌ను చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 7వేల రన్స్ సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు.
కోహ్లి 233 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక కింగ్ కోహ్లి ఖాతాలో ఐదు సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి తర్వాతి స్థానంలో శిఖర్ ధవన్ (6536), డేవిడ్ వార్నర్ (6189), రోహిత్ శర్మ (6063) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
7⃣0⃣0⃣0⃣ 𝗜𝗣𝗟 𝗥𝗨𝗡𝗦 𝗙𝗢𝗥 𝗞𝗜𝗡𝗚 𝗞𝗢𝗛𝗟𝗜! 👑@imVkohli becomes the first batter to surpass this milestone in IPL 🫡
— IndianPremierLeague (@IPL) May 6, 2023
TAKE. A. BOW 👏#TATAIPL | #DCvRCB | @RCBTweets pic.twitter.com/VP4dMvLTwY
Comments
Please login to add a commentAdd a comment