Eng Vs Ind 1st One Day.. ఫామ్‌లేమీతో ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగలింది. భారత్-ఇంగ్లాండ్ మధ్య రేపు(మంగళవారం) జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరమైనట్టు తెలుస్తోంది. గజ్జల్లో గాయం కారణంగా కోహ్లీ.. కిన్నింగ్టన్ ఓవల్‌లో జరిగే మ్యాచ్‌లో ఆడటంలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
సోమవారం జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు కూడా కోహ్లీ రాలేదని సమాచారం. ఈ మేరకు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక, భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సీరిస్‌లో భాగంగా రేపు మొదటి మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్(14వ తేదీ), మూడో మ్యాచ్(17వ తేదీ)న జరుగనున్నాయి. కాగా, చివరి రెండు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం. మరోవైపు.. ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. పరుగులు సాధించేందుకు కష్టాలు పడుతున్నాడు. టీ20 సీరిస్‌లో కూడా తక్కువ సోర్కుకే అవుట్ కావడంతో అభిమానులు కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, జట్టుతో స్థానం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీని తప్పించాలనే డిమాండ్ లేవనెత్తుతున్నారు.
ఇదిలా ఉండగా.. టీమిండియా తరఫున రెగ్యులర్ కెప్టెన్‌గా విదేశాల్లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఇదే మొదటి వన్డే సిరీస్ కావడం విశేషం. మరోవైపు.. టీ20 సీరిస్‌లో బట్లర్ సేనను రోహిత్ సేన చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సీరిస్‌గా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ నిలిచాడు.
Virat Kohli did not come for optional practice today ahead of the first ODI match at Kennington Oval. He has a suspected groin injury and is unlikely to play the first ODI against England: BCCI sources
— ANI (@ANI) July 11, 2022
ఇది కూడా చదవండి: ఉమేశ్ యాదవ్‌కు బంపరాఫర్.. స్టార్ పేసర్ స్థానంలో ఇంగ్లండ్‌కు పయనం
Comments
Please login to add a commentAdd a comment