దుబాయ్: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి బంతుల్ని వృథా చేయడం తప్ప ఎటువంటి మెరుపులు లేకుండా పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఆడి 3 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన దగ్గర్నుంచి ఇబ్బందులు పడ్డ కోహ్లి చివరకు నిరాశపరిచాడు. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రోహిత్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. దాంతో మరొకసారి ఆర్సీబీ అభిమానులకు నిరాశే ఎదురైంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఫెయిలైన కోహ్లి.. ఈ మ్యాచ్‌లో రాణిస్తాడని ఆశించినా అది జరగలేదు. ప్రధానంగా స్టైక్ రొటేట్ చేయడంతో పాటు షాట్లు కొట్టడంలో కూడా కోహ్లి విఫలమవుతున్నాడు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ తీసుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఫించ్, పడిక్కల్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఫించ్(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అతనికి జతగా పడిక్కల్ కూడా ఆకట్టుకున్నాడు. కాగా, బౌల్ట్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఫించ్ ఔట్ కాగా, ఆపై కాసేపటికి కోహ్లి ఔటయ్యాడు. దాంతో ఆర్సీబీ 92 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. కాగా, దేవదూత్ పడిక్కల్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. (చదవండి: తెవాటియా.. ఐయామ్ వెరీ సారీ: మాజీ చీఫ్ సెలక్టర్)
Comments
Please login to add a commentAdd a comment