టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తన పేలవ ఫామ్‌ను విరాట్ కొనసాగిస్తున్నాడు. గ్రూపు స్టేజి, సూపర్ 8లో నిరాశపరిచిన విరాట్.. సెమీఫైనల్లో కూడా అదే ఆటతీరును కనబరిచాడు.
గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో కింగ్ కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓవరాల్ గా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 10.71 సగటుతో 100 స్ట్రైక్ రేట్‌తో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే సెమీస్‌లో విరాట్ విఫలమైనప్పటికి భారత్ మాత్రం ఫైనల్లో అడుగుపెట్టింది. జూన్ 29(శనివారం)న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.
ఈ క్రమంలో కనీసం ఫైనల్లో నైనా కోహ్లి సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత జట్టు మెనెజ్‌మెంట్ కూడా విరాట్‌కు సపోర్ట్‌గా ఉంది.
ఈ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లి ఫామ్ భారత జట్టును ఎటువంటి ఆందోళన కలిగించదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
"కోహ్లి భారీ స్కోర్ చేయకపోయినా ఇబ్బంది లేదు. అతడు రాజులకే రాజు. నా స్నేహితుడు కూడా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా భారత్- దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment