
Virat Kohli Post About Yuvraj Singh Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన పట్ల చూపిన అభిమానానికి మురిసిపోతున్నాడు. తనకు ప్రత్యేక బహుమతి పంపినందుకు అతడికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఓ ప్రముఖ బ్రాండ్‌కు సంబంధించిన గోల్డెన్ బూట్స్‌ను కోహ్లికి పంపిన యువీ.. భావోద్వేగ లేఖను రాసిన సంగతి తెలిసిందే. ప్రపంచానికి కింగ్ కోహ్లివి అయినా తనకు మాత్రం ఎల్లప్పుడూ చీకూవే అంటూ ప్రేమను కురిపించాడు.
ఇందుకు స్పందించిన విరాట్ కోహ్లి ఇన్‌స్టా వేదికగా యువీకి ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు యువీ పాజీ పట్ల తన మనసులో ఉన్న భావాలకు అక్షర రూపం ఇచ్చాడు. ‘‘నా పట్ల ఇంతటి ఆదరణ చూపిన యువీ పా.. మీకు ధన్యవాదాలు. నా కెరీర్ మొదలైన తొలి రోజు నుంచి మిమ్మల్ని చూస్తున్నా.. మీ జీవితం.. కాన్సర్ నుంచి కోలుకుని ముందుకు సాగుతున్న తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శం. మీ చుట్టూ ఉన్న మనుషుల పట్ల ఎంతటి దయ, ఆదరాభిమానాలు కలిగి ఉంటారో నాకు తెలుసు. మీరు అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నారు.. ఉంటారు.
ఇప్పుడు మనం తండ్రులం అయ్యాం కదా! ఈ సరికొత్త ప్రయాణంలో మీకు ఆ దేవుడి ఆశీసులు అందాలని, అందమైన జ్ఞాపకాలు, అంతులేని సంతోషాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అంటూ కోహ్లి.. యువీ పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకున్నాడు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా టీమిండియా తరఫున కలిసి ఆడిన యువరాజ్ సింగ్, కోహ్లి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే కోహ్లి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహమాడగా.. వీరికి కుమార్తె వామిక జన్మించింది. యువరాజ్- నటి హాజిల్‌కీచ్ దంపతులకు ఇటీవలే కుమారుడు జన్మించాడు.
చదవండి: Rohit-Ritika Sajdeh: రోహిత్ నన్ను పట్టించుకో.. ప్లీజ్ ఒకసారి ఫోన్ చేయ్: రితికా శర్మ
Comments
Please login to add a commentAdd a comment