IND Vs LEI Day 3 Highlights: Virat Kohli, Ravindra Jadeja,Shreyas Iyer Hits Half Centuries - Sakshi
Sakshi News home page

IND vs LEI: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. స్కోర్: 364/9

Published Sun, Jun 26 2022 7:38 AM | Last Updated on Sun, Jun 26 2022 8:51 AM

Virat Kohli, Ravindra Jadeja,Shreyas Iyer Shine as IND Post 364 9 Day3 - Sakshi

లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను భారత బ్యాటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. నాలుగు రోజుల ఈ మ్యాచ్‌లో మూడో రోజు శనివారం భారత బ్యాటర్లు విరాట్‌ కోహ్లి (98 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (89 బంతుల్లో 62; 11 ఫోర్లు), రవీంద్ర జడేజా (77 బంతుల్లో 56 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

ఓవర్‌నైట్‌ స్కోరు 80/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 7 వికెట్లకు 364 పరుగులు సాధించింది. శ్రీకర్‌ భరత్‌ (98 బంతుల్లో 43; 7 ఫోర్లు), హనుమ విహారి (55 బంతుల్లో 20; 2 ఫోర్లు) కూడా రాణించారు. లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత బౌలర్లలో నవదీప్‌ సైనీ మూడు వికెట్లు, కమలేశ్‌ నాగర్‌కోటి రెండు వికెట్లు తీశారు.
చదవండిAhmed Shehzad: 'కోహ్లికి ధోని అండ.. పాక్‌లో పుట్టడం నా దురదృష్టం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement