గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతూ, టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను సైతం కోల్పోయిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. 2021 సంవత్సరానికి గానూ డఫ్ అండ్ ఫెల్ప్స్ ప్రకటించిన ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీల జాబితాలో వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచాడు. 2020 (237.7 మిలియన్ డాలర్లు)తో పోలిస్తే కోహ్లి బ్రాండ్ వాల్యూ 185.7 మిలియన్ డాలర్లకు తగ్గినప్పటికీ ఇండియాస్ టాప్ మోస్ట్ సెలెబ్రిటీగా తన హవాను కొనసాగించాడు.
ఈక్రమంలో కోహ్లి బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్ (158.3), అక్షయ్ కుమార్ (139.6)లను వెనక్కునెట్టి టాప్ సెలబ్రిటీగా తనకు తిరుగులేదని చాటాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 61.2 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో ఐదో స్థానంలో నిలిచాడు. 2020 (36.3)తో పోలిస్తే ధోని బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. ఐపీఎల్ మినహాయించి క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పనప్పటికీ, ధోని ఇప్పటికీ 25 బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జాబితాలో స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి టాప్ 20లోకి ఎంట్రీ ఇచ్చింది. 2021లో సింధు బ్రాండ్ విలువ 22 మిలియన్ డాలర్లుగా ఉంది.
చదవండి: జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!?
Comments
Please login to add a commentAdd a comment